బిగ్ బాస్ హౌస్‌లో 'నువ్వా, నేనా' అంటూ సాగిన నామినేషన్!
on Oct 6, 2022
ఇరవై తొమ్మిదో రోజు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, చివరిదాకా ఉత్కంఠభరితంగా కొనసాగింది. అయితే ఈ ప్రక్రియలో ఎంటర్టైన్మెంట్ డోస్ ని రోజు రోజుకి అమాంతం పెంచేస్తున్నాడు బిగ్ బాస్. సరికొత్త టాస్క్ లతో అటు హౌస్ మేట్స్ కు, ఇటు ప్రేక్షకులకు సస్పెన్స్ తో కూడిన వినోదాన్ని అందిస్తున్నాడు.
"హౌస్ లో ఉన్నవాళ్ళలో ఇద్దరి పేర్లు పిలవడం జరుగుతుంది. కెప్టెన్ కీర్తి, ఆ ఇద్దరికి సంకెళ్లు వేస్తుంది. ఎవరు నామినేట్ అవుతారో, ఎవరు సేవ్ అవుతారో ఇద్దరూ కలిసి డిసైడ్ చేసుకోండి" అని బిగ్ బాస్ నిర్దేశించాడు. మొదట ఇనయా, శ్రీహాన్ పేరు పిలిచాడు. శ్రీహాన్ కి, ఇనయాకి మధ్య జరిగిన సంభాషణలో చివరికి ఇనయా "నామినేట్ అవుతున్నా" అని చెప్పేసింది.
ఆ తర్వాత సుదీప, వసంతికి మధ్య జరిగిన సంభాషణలో వసంతి నామినేట్ గా మిగిలింది. ఆదిరెడ్డికి, రేవంత్ కి జరిగిన మాటల్లో చివరికి ఆదిరెడ్డి నామినేట్ అయ్యాడు. ఫైమాకి, సూర్యకి మధ్య జరిగిన డిస్కషన్ లో నామినేషన్ గా ఫైమా తప్పుకుంది. చంటికి, గీతూకి జరిగిన చర్చలో చంటి నామినేట్ అవ్వడానికి అంగీకరించగా హౌస్ మేట్స్ అందరు చప్పట్లతో కంగ్రాట్స్ చెప్పారు.
ఇక జంటగా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్ లకు సెపరేట్ గా ఉండి ఎవరి గేమ్ వారు ఆడాలి అని, "ఇద్దరిలో ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారు? ఎవరు నామినేట్ అవ్వాలనుకుంటున్నారు?" అని బిగ్ బాస్ అడుగగా, ఇద్దరు నిర్ణయించుకోలేకపోయారు. రోహిత్ ఏడుస్తుండగా, మెరీనా ధైర్యం చెప్పి రోహిత్ ని ఒప్పించింది. చివరకు మెరీనా "నేను నామినేట్ అవుతున్నా" అని తప్పుకుంది.
అర్జున్ కి, శ్రీసత్యకి జరిగిన మాటలలో అర్జున్ మళ్ళీ శ్రీసత్య కోసం నామినేషన్లో ఉంటానని ఒప్పుకున్నాడు. కాగా ఈ వారం అర్జున్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని అభిమానులు అనుకుంటున్నారు. ఐతే గట్టి పోటీదారులు ఐనా గీతు, రేవంత్ నామినేషన్లో నుండి సేవ్ అవ్వడం బాగుందంటున్నారు.
పోటా పోటీగా సాగిన నామినేషన్ల ప్రకియలో కంటెస్టెంట్స్ మాట్లాడిన మాటలకు, ఈ వారం హౌస్ లో అందరు టాస్క్ లు, గేమ్ లు బాగా ఆడుతారనిపిస్తోంది. కాగా పోటీ మాత్రం గట్టిగానే ఉండేలా ఉంది. ఇక ఈ వారం ఎవరు బాగా ఆడి నామినేషన్లో నుండి సేవ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. ఈ వారం మెరీనా, ఇనయా, వసంతి, అర్జున్, ఆదిరెడ్డి, ఫైమా, ఆదిత్య, చంటి నామినేషన్లో ఉన్నారు.